క్యాన్సర్ ఆస్పత్రి సిబ్బందికి బాలయ్య సాయం..!

క్యాన్సర్ ఆస్పత్రి సిబ్బందికి బాలయ్య సాయం..!

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ప్రముఖులు తమ వంతు సహాయం చేస్తున్నారు. తాజాగా లాక్ డౌన్ నేపథ్యంలో లెజెండ్ బాలకృష్ణ తమ బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బందికి నిత్యావసరాలు సరఫరా చేసారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, దివ్యాంగులకు, మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి బాలకృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన ప్యాక్ లను అందించారు. లాక్ డౌన్ కాలం లోను పని చేస్తున్న తమ ఆస్పత్రి సిబ్బందికి ప్రోత్సాహం అందించడానికి ప్యాక్ లు అందజేసినట్టు తెలిపారు. అంతే కాకుండా ఆస్పత్రిలో ఉంటున్న మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి లాక్ డౌన్ ముగిసేవరకూ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామన్నారు.