అగ్రిగోల్డ్ చైర్మన్ సహా డైరెక్టర్లకు బెయిల్...

అగ్రిగోల్డ్ చైర్మన్ సహా డైరెక్టర్లకు బెయిల్...

సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో అగ్రిగోల్డ్ చైర్మన్ సహా ఆరుగురు డైరెక్టర్లకు బెయిల్ మంజూరు చేసింది మచిలీపట్నం కోర్టు... 60 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయటంలో సీఐడీ విఫలం కావడంతో బెయిల్ మంజూరైంది. నిందితులు అందరూ ప్రస్తుతం ఏలూరు సబ్ జైలులో ఉన్నారు.   బెయిల్ మంజూరైనా ఇతర కేసుల్లో నిందితులుగా ఉండడంతో జైలులోనే ఉండే అవకాశాలున్నాయి. కృష్ణా జిల్లాలో చిలకvపూడి, జగ్గయ్యపేట కేసులకు సంబంధించి సీఐడీ ఛార్జిషీట్ సకాలంలో వేయని కారణంగానే బెయిల్ మంజూరైంది. చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయాల్సిఉంటుంది. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అగ్రిగోల్డ్‌పై 16 కేసులు నమోదయ్యాయి... ఏపీలోని  కడప, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రిలో కేసులు నమోదు కాగా... తెలంగాణలోని హైదరాబాద్ ఎల్బీనగర్, మహబూబ్‌నగర్, నల్గొండలో కేసులు ఉన్నాయి. ఇప్పటికే అన్ని జిల్లా కోర్టులలో బెయిల్ మంజూరైంది... ఈ రోజు కృష్ణా జిల్లాలోని చివరి కేసులో బెయిల్ మంజూరు చేశారు జిల్లా కోర్టు జడ్జి. మచిలీపట్నం కోర్టు... అవ్వా వెంకట రామారావు, అవ్వా ఉదయ్ భాస్కర్, అవ్వా మణిశర్మ,  అవ్వా శేషు నారాయణ రావు,  ప్రసాద్, సాయిరాంకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కర్ణాటకలో అవ్వా వెంకట రామారావు, శేషు నారాయణ రావుపై కేసు పెండింగులో ఉండగా... మిగతా నిందితులు విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు.