బీజేపీయేతర పక్షాలు మాతో కలిసిరావాలి..

బీజేపీయేతర పక్షాలు మాతో కలిసిరావాలి..

కర్ణాటకలో అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీయేతర పక్షాలన్నీ ఏకం కావాల్సి ఉందని జేడీఎస్‌ శాసనసభాపక్ష నేత కుమారస్వామి పిలుపునిచ్చారు. ఇవాళ బెంగళూరులో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. దీన్ని ఎదుర్కొనేందుకు మాయావతి, మమతాబెనర్జీ, చంద్రబాబునాయుడు, కేసీఆర్‌ తమతో కలిసిరావాలని కోరారు. వీరందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు దేవెగౌడ చొరవ చూపాలన్నారు. తమ ఎమ్మెల్యేలను ఈడీ సాయంతో బెదిరించాలని బీజేపీ చూస్తోందని కుమారస్వామి ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే తమ తక్షణ కర్తవ్యమని కుమారస్వామి అన్నారు.

 .