రికార్డ్ బ్రేకింగ్ `అవెంజ‌ర్స్ 2`

రికార్డ్ బ్రేకింగ్ `అవెంజ‌ర్స్ 2`

`అవెంజ‌ర్స్‌-ఇన్‌ఫినిటీ వార్‌` సంచ‌ల‌న వ‌సూళ్ల‌తో రికార్డులు తిర‌గ‌రాస్తోంది. తాజాగా ఈ సినిమా ఖాతాలో మ‌రో రికార్డ్‌. ఈ సినిమ దాదాపు 1.16ల‌క్ష‌ల కోట్ల వ‌సూళ్ల‌తో `జురాసిక్ వ‌ర‌ల్డ్‌` రికార్డుల్సి స‌వ‌రించింది. వ‌ర‌ల్డ్ టాప్‌-4 సినిమాగా రికార్డుల‌కెక్కింది. 

ఇప్ప‌టివ‌ర‌కూ అవ‌తార్ -2.8 బిలియ‌న్ డాల‌ర్ల‌తో నంబ‌ర్ -1 స్థానంలో నిల‌వ‌గా, టైటానిక్ -2.2 బిలియ‌న్ డాల‌ర్ల‌తో రెండో స్థానం ద‌క్కించుకుంది. స్టార్ వార్స్ : ఫోర్సెస్ అవేకెన్స్‌- 2.1 బిలియ‌న్ డాల‌ర్ల‌తో మూడో స్థానంలో ఉంది. ఆ త‌ర‌వాత నాలుగో స్థానంలో జురాసిక్ వ‌ర‌ల్డ్ -1.67 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును అధిగ‌మించి `అవెంజ‌ర్స్ 2` ఏకంగా 1.7 బిలియ‌న్ డాల‌ర్ల‌తో సంచ‌ల‌నాలు సృష్టించింది. `జురాసిక్ వ‌ర‌ల్డ్‌`ని ఐదో స్థానానికి ప‌రిమితం చేసింది.