విస్సన్నపేటలో ఆటో లారీ ఢీ... ఐదుగురు మృతి 

విస్సన్నపేటలో ఆటో లారీ ఢీ... ఐదుగురు మృతి 

కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విస్సన్నపేట వైపు నుంచి నూజివీడు వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో ఆటోడ్రైవర్‌ సహా నలుగు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. మృతులు  రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ రాజారావు, లక్ష్మీకాంతం (45), ప్రేమలత, మూడు నెలల పసికందుతో మొత్తం ఐదుగురిని పోలీసులు గుర్తించారు. మృతుల్లో పసికందు ఉండటంతో అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.