ఆ పని చేయడానికి యత్నించిన ఆటో డ్రైవర్ ను ప్రజలేంచేశారో తెలుసా? 

ఆ పని చేయడానికి యత్నించిన ఆటో డ్రైవర్ ను ప్రజలేంచేశారో తెలుసా? 

మహిళలపై దేశంలో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.  ఎన్ని చట్టాలు చేసినా వీటిని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు.  తాజాగా ఆదోని పట్టణంలో మరో ఘోరం వెలుగు చూసింది.  అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై ఓ ఆటో డ్రైవర్ కన్నేశాడు.  ఇంటిముందు ఆదుకుంటున్న ఆ చిన్నారికి ఆశ చూపించి ఆటోలో ఎక్కించుకొని దూరప్రాంతానికి తీసుకెళ్లి... నిర్మాణుష్య ప్రాంతంలో అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నం చేశాడు.  

చిన్నారి పెద్దగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న కొంతమంది ఆ ఆటోడ్రైవర్ ను పట్టుకున్నారు.  అక్కడే నాలుగు తగిలించి ఆదోని పోలీసులకు అప్పగించారు.  చిన్నారిని వైద్య పరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.  ఈ న్యూస్ పట్టణంలో దావనంగా వ్యాపించడంతో పెద్ద ఎత్తున అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.  ఆటో డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని లేదంటే తమకు అప్పగించాలని తాము చూసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాగా, ఫోక్సో, కిడ్నాప్, అత్యాచారయత్నం వంటి కేసులు నమోదు చేశారు.