టాస్ గెలిచిన ఆసీస్.. బ్యాటింగ్‌కు దిగిన భారత్...

టాస్ గెలిచిన ఆసీస్.. బ్యాటింగ్‌కు దిగిన భారత్...

వరుస విజయాలతో టీమిండియా దూసుకెళ్తోంది... 2020 ఏడాదిలోనూ శ్రీలంకపై టీ-20 సిరీస్ కైవసం చేసుకుని శుభారంభం చేసింది.. ఇక, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో తలపడుతోంది భారత జట్టు. ఇక, తొలి వన్డే మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నారు కంగారులు.. ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ టాస్‌ గెలిచిన అనంతరం భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. వరుస విజయాలతో టీమిండియా మంచి ఫామ్‌లో ఉండగా... ప్రత్యర్థి ఆసీస్ కాబట్టి... అటు.. ఇటు పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఇక, టీమిండియా ధావన్, రోహిత్, రాహుల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్, సమి, కుల్దీప్, బుమ్రాతో రంగంలోకి దిగింది. బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఐదు బంతుల్లోని ఎనిమిది పరుగులు సాధించింది... ఓపెనర్ రోహిత్ శర్మ రెండు ఫోర్లు బాదాడు.