ఆసీస్ ఆటగాళ్ల ఆశలపై నీళ్లు చల్లిన బోర్డు... ఆ సిరీస్ రద్దు..

ఆసీస్ ఆటగాళ్ల ఆశలపై నీళ్లు చల్లిన బోర్డు... ఆ సిరీస్ రద్దు..

కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన క్రికెట్ మ్యాచ్లు వచ్చే నెల 8 న ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య జరగనున్న మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ తో ప్రారంభంకానున్నాయి.  అయితే ఆ సిరీస్ తర్వాత పాకిస్థాన్ తో ఆడాల్సిన సిరీస్ కోసం రెండు జట్లకు ఆతిధ్యమిస్తుంది ఇంగ్లాండ్. అదే తరహాలో ఆగస్టు 9 నుండి 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం జింబాబ్వేకు ఆతిథ్యమిస్తు తమ క్రికెట్ ను తిరిగి ప్రారంభించాలని అనుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా. కానీ ఇప్పుడు ఆ సిరీస్ ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాలో ఇప్పటికే 7,836 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 104 మంది చనిపోయారు. అలాగే అక్కడ సెప్టెంబరు వరకు పర్యాటక వీసాలపై నిషేధం ఉంది. దాంతో జింబాబ్వే ఆటగాళ్లు ఆసీస్ కు  వచ్చే మార్గం లేకపోడంతో.. ఆ బోర్డుతో చర్చించి సిరీస్‌ని వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే ఈ సిరీస్ తిరిగి కరోనా ప్రభావం తగ్గిన తర్వాత నిర్వహిస్తాము అని కూడా తెలిపింది.