నేడు రాహుల్‌ గాంధీ ఇఫ్తార్‌

నేడు రాహుల్‌ గాంధీ ఇఫ్తార్‌

దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న ఇఫ్తార్‌ కావడం.. అందులోనూ రాహుల్‌ పార్టీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తాజ్ ప్యాలెస్ వేదికగా ఇవ్వబోతున్న ఈ విందుకు ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌యాదవ్, ఎన్సీపీ అధినేత పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, తదితరులకు ఆహ్వానాలు అందినట్లు తెలిసింది. పూర్వ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఆహ్వానం పంపలేదన్న వార్తలొచ్చినా.. అవి పుకార్లేనని తేలిపోయింది. మొన్న కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ఎన్డీయే వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగట్టే ఆలోచనలో ఉన్న రాహుల్.. ఈ విందు ద్వారా మరోసారి వారందరినీ ఒకే వేదికపైకి తెచ్చే అవకాశం ఉందని. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానాలందిందీ లేనిదీ తెలియాల్సి ఉంది.