ఏటీఎం... దొంగ అరెస్ట్  

ఏటీఎం... దొంగ అరెస్ట్  

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలో డబ్బులు దొంగతనం చేసిన దొంగ దొరికిపోయాడు. అక్కడ సమీపంలోని  కమలా నగర్లో ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంలో  దొంగతనం సంచలనం రేపింది. కేసును దర్యాప్తు చేస్తున్న కుషాయిగూడ పోలీసులకు లభ్యమైన పక్కా సమాచారంతో తుడి విగ్నేష్ (28) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

పోలీసు విచారణలో భాగంగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు విగ్నేష్ ఏటీఎంలలో క్యాష్ తీసుకొచ్చే "సి.ఎం.ఎస్" అనే కంపెనీలో క్యాష్ ఇన్చార్జిగా పని చేస్తున్నాడు.  వచ్చే జీతం సరిపోక జల్సాలకు అలవాటు పడ్డ విగ్నేష్ ఈ నెల 9వ తారీకున ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. అతని వద్దనుండి 3.54 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.