బీజేపీ మానసిక పుత్రిక వైసీపీ...

బీజేపీ మానసిక పుత్రిక వైసీపీ...

భారతీయ జనతా పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు... మహానాడు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ... బీజేపీ మానసిక పుత్రిక వైసీపీ అంటూ మండిపడ్డారు. కుట్ర రాజకీయలతో రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దెబ్బతీసిందని ఆరోపించిన అచ్చెన్నాయుడు... రాష్ట్ర అభివృద్ధి కోసం గత ఎన్నికల్లో బీజేపీకి సహకరించాం... ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. నరేంద్ర మోదీ డైరక్షన్‌లోనే వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 

నరేంద్ర మోడీ కన్నా రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు చంద్రబాబే అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు... ఏదో కాలం కలిసివచ్చి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని సెటైర్లు వేశారు. నమ్మక ద్రోహం చేసిన మోడీ, బీజేపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆయన... కన్నా లక్ష్మీనారాయణ... బీజేపీ ఏపీ అధ్యక్షుడు కావటం దురదృష్టకరమన్నారు. పార్టీ మారటానికి సిద్ధపడిన వ్యక్తికి బీజేపీ అధ్యక్షుడు అయ్యాడని ఎద్దేవా చేసిన అచ్చెన్నాయుడు... నాలుగేళ్లలో రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని... మరి ప్రతిపక్షాలు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.