మయన్మార్ లో ఘోర ప్రమాదం..కొండచరియలు విరిగిపడి 50మంది మృతి.!

మయన్మార్ లో ఘోర ప్రమాదం..కొండచరియలు విరిగిపడి 50మంది మృతి.!

మయన్మార్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర మయన్మార్‌లోని జాడే గని వద్ద కొండా చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 50 మంది మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశంలోని అగ్నిమాపక సేవా విభాగం, సమాచార మంత్రిత్వ శాఖ అధికారి నిర్దారించారు. కాచిన్ రాష్ట్రంలోని జాడే-రిచ్ హపకాంత్ ప్రాంతంలో మైనర్లు రాళ్ళు సేకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించింది. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగి పడినట్టు గుర్తించారు. మరణించిన వారితో పాటు మరికొందరు కూడా మట్టి  దిబ్బలో ఇరుకున్నట్టు తెలుస్తోంది. అధికారులు ఇప్పటికే సహాయక చర్యలను ప్రారంభించారు. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.