వైజయంతి మూవీస్ లో ఎన్టీఆర్..!!

వైజయంతి మూవీస్ లో ఎన్టీఆర్..!!
ఒకప్పుడు వైజయంతి మూవీస్ బ్యానర్లో పెద్ద పెద్ద చిత్రాలు నిర్మితమయ్యోవి.  స్టార్ హీరోలతో, భారీ బడ్జెత్ సినిమాలు తీసిన చరిత్ర కలిగిన ఈ సంస్థ గత ఏడేళ్ళుగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నది.  ఎన్టిఆర్ తో శక్తి సినిమా తరువాత అశ్వనీదత్ మరే సినిమాను నిర్మించలేదు.  దత్ కుమార్తెలు స్వప్న సినిమా పేరుతో చిన్న చిన్న సినిమాలు చేస్తున్నారు.  కాగా, మహానటి సినిమా విజయం తరువాత, అశ్వనీదత్ సినిమాలు నిర్మించేందుకు సిద్దమవుతున్నారు.  
 
మహేష్ బాబు హీరోగా, వైజయంతి మూవీస్ పతాకంపై దిల్ రాజుతో కలిసి సినిమా చేస్తున్నారు.   బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా తరువాత, ఎన్టిఆర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు వైజయంతి మూవీస్ సంస్థ. మహేష్ బాబు సినిమా పూర్తికాగానే, ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేస్తారట.  ఇప్పటికే ముగ్గురు దర్శకులతో చర్చలు జరుపుతున్నారని త్వరలోనే ఫైనల్ అవుతుందట.