'ఐపీఎల్ కు పోటీగా ఆసియా కప్'

'ఐపీఎల్ కు పోటీగా ఆసియా కప్'

ఈ ఏడాది చివర్లో శ్రీలంకలో లేదా యుఎఇలో షెడ్యూల్ చేసినట్లుగా ఆసియా కప్ ముందుకు సాగుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈఓ వసీం ఖాన్ చెప్పారు. అయితే ప్రస్తుతం నిలిపివేయబడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌కు చోటు కల్పించడానికి ఈ ఈవెంట్‌ను రద్దు చేయవచ్చనే ఊహాగానాలను ఖాన్ తిరస్కరించారు. ''ఆసియా కప్ ముందుకు సాగుతుంది. పాకిస్తాన్ జట్టు సెప్టెంబర్ 2 న ఇంగ్లాండ్ నుండి తిరిగి వస్తుంది, కాబట్టి మేము సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ టోర్నమెంట్ నిర్వహించాలని చూస్తున్నాము" అని ఆయన అన్నారు. శ్రీలంకలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా లేనందున మేము ఆసియా కప్ అక్కడ జరపాలని చూస్తున్నాము. ఒకవేళ వారు దానిని హోస్ట్ చేయలేకపోతే, యుఎఇ అందుకు సిద్ధంగా ఉంది అన్నారాయన. అక్టోబర్-నవంబరులో ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ జరగకపోతే ఆసియా కప్ నిర్వహిస్తామని  అన్నారు. కానీ అదే విండోలో బీసీసీఐ ఐపీఎల్ జరపాలని చూస్తుంది. అయితే ఏం జరుగుతుందో చుడాలి మరి.