ఆశిష్ నెహ్రా : నేను భారత సెలక్టర్ అయితే ధోనీని...?

ఆశిష్ నెహ్రా : నేను భారత సెలక్టర్ అయితే ధోనీని...?

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి అందరికి తెలుసు. గ్రౌండ్ లో ఎటువంటి సందర్భంలోనైనా ప్రశాంతంగా ఉండటం ధోనీకే సొంతం. అందుకే అతడిని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. అయితే ఈ మిస్టర్ కూల్ కు గత సంవత్సరం జరిగిన ప్రపంచ కప్ తర్వాత నుండి భారత జట్టులో స్థానం దక్కలేదు. అలాగే సెంట్రల్ కాంట్రాక్ట్‌లో బీసీసీఐ ధోనీకి చోటివ్వలేదు. అప్పటినుండి అతని కెరీర్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. ధోని కథ ఇక ముగిసినట్లే అని అంటున్నారు.

ఈ విషయం పై తాజాగా స్పందించిన భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా ధోనీకి మద్దతుగా నిలిచాడు. ఒకవేళ తాను భారత సెలక్టర్ అయితే మాత్రం తప్పకుండ ధోనీకి మళ్ళీ తిరిగి జట్టులో స్థానం కల్పిస్తాను అని తెలిపాడు. నేను ధోనీని సెలక్ట్ చేస్తాను కానీ ఇక్కడ ప్రశ్నేంటంటే... ధోని అసలు మళ్ళీ ఆడాలనుకుంటున్నాడా... లేదా.. అనేది తనకే తెలియాలి అని నెహ్రా అన్నాడు. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.