ఆ ఎంపీ ది దొంగ సర్టిఫికెట్..హైకోర్టులో పిటీషన్...!

ఆ ఎంపీ ది దొంగ సర్టిఫికెట్..హైకోర్టులో పిటీషన్...!

 

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్‌ సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ క్రిశాంక్‌. MA పొలిటికల్‌ సైన్స్‌ చదివినట్లు అరవింద్‌ దొంగ సర్టిఫికెట్‌ పుట్టించారని... ఆయన పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో కేసు వేయబోతున్నామని చెప్పారు క్రిశాంక్‌.

జనార్దన్ రాయ్‌నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్‌ నుంచి 2018లో MA పొలిటికల్ సైన్స్ పాసైనట్లు అరవింద్ ఎన్నికల అఫిడవిట్లో పొందరుపరిచారని ఆ విద్యా సంస్థకు RTIయాక్ట్‌ కింద దరఖాస్తు చేయగా, 2018లో అరవింద్ పేరుతో అసలు అడ్మిషనే లేదన్న సమాధానం వచ్చిందని క్రిశాంక్‌ చెబుతున్నారు.