టీమిండియాలోకి మరో వారసుడు

టీమిండియాలోకి మరో వారసుడు

అంతర్జాతీయ క్రికెట్‌లోకి మరో వారసుడొస్తున్నాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టీం ఇండియా అండర్-19 జట్టుకి ఎంపికయ్యాడు. వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్తున్న భారత జట్టులో అర్జున్‌కు స్థానం దక్కింది. ఈ టూర్‌లో రెండు రెండు ఫోర్-డే మ్యాచులు, ఐదు వన్డేలు జరుగుతాయి. కేవలం ఫోర్‌-డే మ్యాచ్‌లకే అర్జున్‌ ఎంపికయ్యాడు. ఏడాది క్రితం సెలక్టర్లు ఎంపిక చేసిన అండర్‌-19 కోర్‌ గ్రూప్‌లో అర్జున్‌ సభ్యుడు. 18 ఏళ్ల అర్జున్‌ టెండూల్కర్‌ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని జోనల్‌ క్రికెట్‌ అకాడమీ (జెడ్‌సీఏ)లో ఏర్పాటుచేసిన క్యాంపులోని శిక్షణ పొందుతున్నాడు.