స్పీకర్, రేవంత్ మధ్య వాగ్వాదం...

స్పీకర్, రేవంత్ మధ్య వాగ్వాదం...

స్పీకర్ మధుసూదనాచారి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలను పునరద్ధరించాలంటూ కాంగ్రెస్‌ నేతలు సీఎల్పీ లీడర్‌ జానారెడ్డి నేతృత్వంలో సోమవారం స్పీకర్ మధుసూదనాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి, స్పీకర్‌ మధుసూదనాచారికి మధ్య వాగ్వాదం జరిగింది. కోర్ట్ ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ రేవంత్‌ రెడ్డి నిలదీశారు. పెన్ను దొంగలిస్తేనే ఉరిశిక్ష వేసినట్లుగా మీ వైఖరి ఉందని స్పీకర్‌ను రేవంత్ హేళన చేసాడు. ఈ వ్యాఖ్యలతో అసహనానికి గురైన స్పీకర్‌.. రేవంత్ ఇలా మాట్లాడితే వెళ్లిపోతానని లేచినిలబడ్డారు స్పీకర్. ఈ సమయంలో సీఎల్పీ నేత జానారెడ్డి.. రేవంత్‌ రెడ్డిని సముదాయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.