ఏపీలో రేపటి నుంచి ఆర్టీసీ సర్వీసులు.. రూల్స్ ఇవే..!

ఏపీలో రేపటి నుంచి ఆర్టీసీ సర్వీసులు.. రూల్స్ ఇవే..!

ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.. ఇక, రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ బస్సులు ప్రారంభం కాబోతున్నాయి.. ఇప్పటికే దీనికోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీఎస్ఆర్టీసీ.. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న దృష్ట్యా.. గతంలో తరహాలో బస్సులు నడిపే పరిస్థితి లేకపోవడంతో.. ఏసీ, సిటీ బస్సులు డిపోలకే పరిమితం చేయనున్నారు అధికారులు.. సూపర్ లజ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు బస్సులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో.. అన్ని డిపోల్లో బస్సులను శుభ్రం చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు.. సుమారు 55 రోజుల నుంచి బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో.. వాటి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.. అయితే, రోజుకు 12 గంటల పాటు మాత్రమే ఆర్టీసీ సర్వీసులు నడవనున్నాయి.. ఉదయం 7 గంటలకు బయల్దేరనున్న బస్సులు.. తిరిగి రాత్రి 7 గంటల వరకు డిపోలకు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక, రేపటి నుంచి బస్సులు ప్రారంభం కానుండడంతో.. ఈ రోజు సాయంత్రం నుంచే ఆన్‌లైన్ రిజర్వేషన్లు అందుబాటులోకి తీసుకురానున్నారు.. రిజర్వేషన్‌ చేసుకోనివాళ్లు.. డిపోల్లో బస్సు ఎక్కే ముందే టికెట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. కానీ, బస్సుల్లో టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చేశారు ఆర్టీసీ అధికారులు.. తొలి విడతలో రేపు 1500 బస్సులు రోడ్లపైకి రానుండగా.. శానిటైజర్ అందుబాటులో ఉంచనున్నారు.. ప్రయాణికులు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాల్సిందేనని క్లారిటీగా చెప్పేశారు అధికారులు.