ఉద్యోగులకు ఛార్జ్ మెమో ఇవ్వకూడదు

ఉద్యోగులకు ఛార్జ్ మెమో ఇవ్వకూడదు

ఉద్యోగులకు ఛార్జ్ మెమో ఇవ్వడం కరెక్ట్ కాదని.. పనిష్మెంట్ పేరుతో ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు. విజయవాడ బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నష్టాలు వస్తున్నప్పటికీ.. ప్రజల సౌకర్యార్థం కొన్ని రూట్లలో బస్సులు నడుపుతున్నామని.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,756 బస్సులను ఆర్టీసీ ప్రతిరోజు నడుపుతోందని అన్నారు. అధికారులు.. సంస్థ వేరు వేరు కాదని. సమిష్టిగా పనిచేస్తేనే సంస్థ మనుగడ సాధ్యమని సురేంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ రూ. 510 కోట్ల నష్టంలో ఉందని.. నష్టాలను తగ్గించడానికి అన్ సీజన్ రోజులలో దూరప్రాంత ప్రయాణాలకు ఛార్జీలు తగ్గిస్తామని.. అక్యుపెన్సీ లేని రూట్లలో సర్వీసులు తగ్గిస్తామని ఎండీ తెలిపారు. డీజిల్‌పై లీటర్‌కు నాలుగు రూపాయలు తెలంగాణ కంటే అధికంగా చెల్లిస్తున్నామన్నారు... డీజిల్‌పై లీటర్‌పై ఒక రూపాయి పెరిగితే రూ.30 కోట్ల నష్టం వస్తుందన్నారు. అతి త్వరలోనే తిరుపతిలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు సురేంద్రబాబు వెల్లడించారు.