వచ్చేసింది... యాపిల్ ఐఓఎస్ 12
యాపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఓఎస్ 12ను కంపెనీ విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో జరుగుతున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఐఓఎస్ 12 అప్డేట్ను విడుదల చేశారు. లక్షల కొద్దీ ఐఫోన్లు, ఐప్యాడ్లను మరింతగా అప్ డేట్ చేయడంతో పాటు కొత్త ఫీచర్స్‌ను కూడా తీసుకొచ్చింది కంపెని. బగ్స్‌ను ఫిక్స్ చేయడంతోపాటు ఐఫోన్, ఐప్యాడ్ల పర్ఫామెన్స్ కూడా బాగా మెరుగువుతుందని కంపెనీ సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ క్రెగ్ ఫెడెరిగి తెలిపారు.
ఐఓఎస్ 12 విశిష్టతలు...
- మరింత వేగంగా, మరింత రెస్పాన్సివ్‌గా పనిచేస్తుంది.
- ఐఓఎస్ 12తోపాటు ఏఆర్‌కిట్2ను యాపిల్ ప్రవేశపెట్టింది. దీంతో మరింత మెరుగైన యాప్స్‌ను డెవలప్ చేసుకోవచ్చు.
- గ్రూప్ ఫేస్ టైమ్... యాపిల్లోఉండే ఫేస్‌టైమ్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను మరింత మెరుగుపర్చారు. కొత్త గ్రూప్ ఫేస్ టైమ్ ఫీచర్‌తో ఒకేసారి అనేక మందితో చాట్ చేయొచ్చు.
- సిరి షాట్‌కట్స్... సిరితో ఈ రంగంలో కొత్త సంచలనానికి తెరలేపిన యాపిల్‌కు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాల నుంచి పోటీ ఎదురైంది. ఇపుడు సిరి మరింత స్మార్ట్‌గా చేశారు ఐఓఎస్ 12తో. ఇప్పుడు అన్ని యాప్‌లు సిరితో పనిచేస్తాయి. మరింత ఫాస్ట్‌గా.. కరెక్ట్ టైమ్‌కు పని పూర్తి చేస్తాయి. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి.
- ఫోటో సెర్చ్‌ను మరింత మెరుగుపర్చారు.
- డు నాట్ డిస్టర్బ్... నోటిఫికేషన్ బెడద లేకుండా హాయిగా నిద్రపోయేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పైగా బెడ్ టైమ్ మోడ్‌ని ఆన్ చేస్తేడిస్ప్లే కూడా డిమ్ అయిపోతుంది. పైగా మీరు చెప్పిన సమయానికి ఈ డీఎన్డీ బెడ్‌టైమ్ మోడ్ పూర్తయి నార్మల్లోకి వచ్చేస్తుంది.
- గ్రూప్డ్ నోటిఫికేషన్స్... నోటిఫికేషన్ ఎపుడూ తలనొప్పే. ఒక్కోసారి క్షణం తీరిక లేకుండా వస్తూనే ఉంటాయి.ఈ తలనొప్పి నుంచి బయటపడేందుకు గ్రూప్డ్ నోటిఫికేషన్ తెచ్చారు. దీంతో వీటన్నింటిని మీరు అనుకున్న నిర్ణీత సమయంలో చూడొచ్చు.
- స్ర్కీన్ టైమ్... అందరూ ఊహించినట్లే డిజిటల్ హెల్త్ ఫీచర్‌ను ఐఓఎస్12లో పొందుపర్చారు. దీనివల్ల యాప్స్, వెబ్‌సైట్స్‌పై మీరు వెచ్చించే సమయాన్ని ఈ ఫీచర్ కంట్రోల్ చేస్తుంది.ఒక్కో యాప్‌పై మీరు ఎంత సమయం వెచ్చించారో గంటవారీ, రోజువారీ, వారంవారీగా డేటా తెలుపుతుంది.
- ప్రైవసీ అండ్ సెక్యూరిటీ... యాపిల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, మెరుగైన ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి ఐఓఎస్ 12 అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. సఫారీలో ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ ప్రివెన్షన్ ఆప్షన్‌తో మీరు సోషల్ మీడియా లైక్ లేదా షేర్ బటన్స్‌ను బ్లాక్ చేయొచ్చు.
- మెమోజీ, ఫన్ కెమెరా ఎఫెక్ట్స్.. గత ఏడాది అనిమోజీని ప్రవేశపెట్టిన యాపిల్ ఈసారి మెమోజీలను ప్రవేశపెట్టింది.
- మెజర్ యాప్... కొత్త యాప్ ఇది. వస్తువులు, గోడల కొలతలను ఈ ఫీచర్‌తో కొలవొచ్చు.
- ఐ బుక్స్‌ను యాపిల్ బుక్స్‌గా రీడిజైన్ చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)