ఏపీలో తెరుచుకున్న పాఠశాలలు

ఏపీలో తెరుచుకున్న పాఠశాలలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దాదాపు 50 రోజులు వేసవి సెలవుల అనంతరం ఈ రోజు పాఠశాలలు తెరుచుకున్నాయి. ఏపీలోని విశాఖలో 2018-19 విద్యాసంవత్సరానికి గాను జిల్లావ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైయ్యాయి. విశాఖ జిల్లాలో మొత్తం 5011 పాఠశాలలు ఈ రోజు తెరుచుకున్నాయి. విశాఖలో 6.25 లక్షల మంది విద్యార్థినీవిద్యార్థులు బడిబాట పట్టారు. అందులో 3.15 లక్షల ప్రాథమిక విద్యార్థులు, 1.85 లక్షల ప్రాథమికోన్నత విద్యార్థులు, 1.25 లక్షల ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఉన్నారు.