ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు...అయినా ?

ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు...అయినా ?

దేశవ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఏపీ, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాలు,  జార్ఖండ్ రాష్ట్రంలో రెండు, మణిపూర్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. నలుగురు సభ్యులకు గానూ ఐదుగురు రేస్ లో నిలిచారు. అధికార పార్టీ నుంచి నలుగురు పోటీ చేస్తుండగా టీడీపీ కూడా తమ అభ్యర్థిని బరిలో దించింది. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.  

వైసీపీ తరుఫున పరిమళ్‌ నత్వాని, మోపిదేవి వెంకటరమణ ,ఆళ్ల అయోద్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పోటీ పోటీ చేస్తుండగా, తెలుగుదేశం పార్టీ నుంచి వర్ల రామయ్య బరిలో ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న 175 మంది  శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహిస్తున్న పోలింగ్‌ ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు  కొనసాగనున్నది. పోలింగ్ కోసం అసెంబ్లీ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. వాస్తవానికి టీడీపీకి, రాజ్యసభ ఎన్నికకు అవసరమైన బలం లేదు. అయినా రాజకీయ వ్యూహంలో భాగంగా వర్లరామయ్యను పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించింది. దీంతో ఏపీలో ఎన్నిక రసవత్తరంగా మారింది.