ఏపీ ఎన్ఆర్ఐల కొత్త టెన్షన్..ఇళ్లకు వెళతామంటూ ఒత్తిడి !

 ఏపీ ఎన్ఆర్ఐల కొత్త టెన్షన్..ఇళ్లకు వెళతామంటూ ఒత్తిడి !

విదేశాల నుంచి వస్తున్న ఏపీ వాసులను రిసీవ్ చేసుకోవడానికి వచ్చే బృందాలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వందే భారత్ మిషన్‌లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను ప్రత్యేక విమానాల్లో తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో చికాగో నుంచి ఓ ప్రత్యేక విమానం ఈరోజు హైదరాబాద్ చేరుకోగా ఆ విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 33 మంది ఉన్నారు. అలా చికాగో నుంచి వచ్చిన ఏపీ వాసులను పెయిడ్‌ క్వారంటైన్‌కు ప్రభుత్వం తరలించింది. అయితే తమ ఇళ్లకు తాము వెళ్లిపోతామంటూ కొందరు ఎన్‌ఆర్‌ఐలు. అధికారులపై ఒత్తిడి పెడుతోన్నట్టు చెబుతున్నారు.

హోమ్ క్వారంటైన్‌లో ఉంటామని.. తమకు గెస్ట్‌ హౌసులు ఉన్నాయంటూ పలువురు ఎన్‌ఆర్‌ఐలు అధికారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఇళ్లకు పంపేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇక రెండో విడతగా వచ్చే ఎన్‌ఆర్‌ఐలకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. విజయవాడ, విశాఖ నగరాల్లో ప్రైవేటు హోటళ్లను పెయిడ్‌ క్వారంటైన్‌ కోసం వినియోగిస్తోంది ప్రభుత్వం. అవసరమైతే ఉంటాయని గుంటూరు, ఏలూరు వంటి నగరాల్లో కూడా హోటళ్లను సిద్దం చేస్తున్నారు అధికారులు.