ఎన్టీఆర్ పుట్టినరోజే నా బర్త్‌డే కావడం సంతోషం...

ఎన్టీఆర్ పుట్టినరోజే నా బర్త్‌డే కావడం సంతోషం...

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు పుట్టిన రోజునే నా బర్త్‌డే కూడా కావడం ఆనందంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పరిటాల సునీత... విజయవాడ కానూరులోని సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న మహానాడు ప్రాగణంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని సందర్శించిన ఆమె... తమ కుమారుడు పరిటాల శ్రీరాంతో కలసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతీ ఏడాది పరిటాల రవి వర్ధంతి, ఎన్టీఆర్ పుట్టిన రోజున బ్లడ్ డొనేట్ చేస్తానని తెలిపారు. రక్త దానం ఒక జీవితాన్ని నిలబెడుతుంది... బ్లడ్ డొనేషన్ పై ఉన్న అపోహలు నిజం కాదన్నారామె. రక్తదానం చేయడం ద్వారా మరింత ఆరోగ్యం ఏర్పడుతుందని స్పష్టం చేశారు సునీత. మరోవైపు మహానాడు ప్రాంగణంలో సునీత బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.