'ఆ' రూ.2,100 కోట్లు ఎక్కడ అమిత్‌షా జీ..?

'ఆ' రూ.2,100 కోట్లు ఎక్కడ అమిత్‌షా జీ..?

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ మంత్రి నారాయణ. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 1500 కోట్లేనని.. కానీ రూ.2,100 కోట్లని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అంటున్నారని. అవి ఎప్పుడు విడుదల చేశారో చెప్పాలని షాను డిమాండ్ చేశారు నారాయణ. కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు యూసీలిచ్చామని.. వాటిని నీతి ఆయోగ్ కూడా ఆమోదించిందని.. నీతి అయోగ్ ఆమోదం తెలిపిన వాటిని అమిత్ షా తప్పుపడతారా అని మంత్రి ప్రశ్నించారు. యూసీలను ఆధారం చేసుకునే అమరావతి నిర్మాణానికి మరిన్ని నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసిందని నారాయణ గుర్తు చేశారు.