నేడు ఏపీ ఇంటర్‌ సప్లి ఫలితాలు

నేడు ఏపీ ఇంటర్‌ సప్లి ఫలితాలు

ఈ రోజు ఏపీ ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. విశాఖపట్నం ఆంధ్రా వర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలోని వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో మధ్యాహ్నం 11 గంటలకు ఫలితాలు విడుదల అవనున్నాయి. ఈ పరీక్ష ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు. ఇటీవలే ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే.