ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ... 18  రోజుల్లో ఫలితాలు విడుదల చేయడం ఆల్ టైం రికార్డ్ అని అన్నారు. మార్చి 2018లో ఫెయిలైన విద్యార్థులు 1,53,319 మంది పరీక్షలు రాయగా.. 48,998 మంది  పాసయ్యారని తెలిపారు. ఈ ఏడాది నుంచి ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 50 ఇంటర్‌  కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంటా ప్రకటించారు.