ఏపీకి వెళ్లాలనుకునే వారికి శుభవార్త !

ఏపీకి వెళ్లాలనుకునే వారికి శుభవార్త !

కేంద్ర హోమ్ శాఖ జారీ చేసిన ఆన్ లాక్ 3 మార్గదర్శకాల ప్రకారం రాష్టాల మధ్య రాకపోకలు ఇంకా సులభతరం అయ్యాయి. ఇక నుంచి ఏపీకి వచ్చే వారు ఎవరైనా స్పందన వెబ్ సైట్ ద్వారా ఆటోమేటిక్ ఇ- పాస్ లు జారీ కానున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రాకపోకల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. నిజానికి ఇప్పటిదాకా ఈ విషయం మీద చాలా ఆంక్షలు ఉన్నాయి. ఎవరు రాష్ట్రములోకి రావాలన్నా స్పందన పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటే, దానిని ఆయా జిల్లాల కలెక్టర్ ఆఫీసుల్లో ఉన్న సిబ్బంది చెక్ చేసి, జెన్యూన్ రీజన్ ఉంటేనే పాస్ జారీ చేసేవారు.

కానీ ఇప్పుడు ఏపీకి వచ్చేవారు స్పందన వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకుంటే ఆటోమేటిక్ ఇ- పాస్ లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్పందన వెబ్ సైటులో పేరు నమోదు చేస్తే మొబైల్, ఈమెయిల్ లకు తక్షణం ఇ-పాస్ జారీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. చెక్ పోస్టుల వద్ద గుర్తింపు పత్రంతో పాటు, ఇ-పాస్ చూపితే రాష్ట్రంలోకి అనుమతిస్తామని కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రత్యేక అధికారి ఎం.టి.కృష్ణ బాబు స్పష్టం చేశారు. అయితే రాష్ట్రానికి వచ్చే వారిని, వారి ఆరోగ్య పరిస్థితిని  గుర్తించేందుకు, తదుపరి ఆరా తీసేందుకు మాత్రమే స్పందనలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన చెబుతున్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి అంటే రేపటి నుండే ఈ తరహా విధానం అమల్లోకి తీసుకు రానుంది ఏపీ ప్రభుత్వం.