ఏపీ బోర్డర్ వద్ద ఉన్న వారికి షాకిచ్చిన ఏపీ సర్కార్

ఏపీ బోర్డర్ వద్ద ఉన్న వారికి షాకిచ్చిన ఏపీ సర్కార్

మోడీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ లోని కొన్ని హాస్టళ్ళ యాజమాన్యాలు హాస్టల్స్ ఖాళీ చేయమని బలవంతం చేసాయి. దీంతో ఆయా హాస్టల్స్ లో ఉండేవారంతా పోలీసు స్టేషన్స్ కి క్యూ కట్టారు. దీంతో వారు వారి సొంత ప్రాంతాలకి వెళ్లిపోవచ్చంటూ కొన్ని నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ లు జారీ చేశారు. అయితే వాటిని తెలంగాణా పోలీసులు అనుమతించారు కానీ ఏపీ పోలీసులు మాత్రం వారిని బోర్డర్ లోనే ఆపేశారు. అనేక గంటల తర్జనభర్జనల అనంతరం జగ్గయ్యపేట వద్ద హైదరాబాద్‌ నుంచి వచ్చి వేచిచూస్తున్న వారికి రాష్ట్రంలోకి అనుమతి ఇచ్చారు.

హెల్త్‌ప్రోటో కాల్‌ కోసం వారిని అందరినీ ప్రత్యేక బస్సుల ద్వారా క్వారెంటైన్ లకి అధికారులు తరలించారు. వారిని వైద్య పరీక్షలకోసం క్వారంటైన్‌ చేస్తున్నట్టు చెబుతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారిని నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి తరలిస్తున్న అధికారులు, ఈస్ట్‌ గోదావరి వారిని రాజమండ్రి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. వెస్ట్‌గోదావరి జిల్లాల వారిని తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్లకు తరలిస్తున్నారు అధికారులు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా స్వస్థలాలకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇలా క్వారెంటైన్ కి వెళ్ళడం ఇష్టం లేని కొందరు అక్కడి నుండి వెనుతిరుగి హైదరాబాద్ వచ్చేసినట్టు చెబుతున్నారు.