తెలంగాణ ప్రభుత్వం మీద ఏపీ ప్రభుత్వ వర్గాల అసంతృప్తి !

తెలంగాణ ప్రభుత్వం మీద ఏపీ ప్రభుత్వ వర్గాల అసంతృప్తి !

హైదరాబాద్ లో హాస్టల్ విద్యార్ధులు, ఐటీ ఉద్యోగులకు NOC ఇవ్వడంపై ఏపీ  సర్కార్ అసంతృప్తిగా ఉంది. లాక్ డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణ  సర్కారు వ్యవహరించిందని  ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఎక్కడివారు  అక్కడే ఉండమని ప్రధాని ఆదేశిస్తే, NOCలు ఇవ్వడం సమంజసం కాదంటుంది. ఈ తరహా చర్యల వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని  ఆందోళన  వ్యక్తం చేసింది. ప్రధాని సూచించిన లాక్ డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని ఏపీ సర్కార్ అభిప్రాయపడుతోన్నట్టు చెబుతున్నారు. ఏపీతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఎన్ఓసీలు ఎలా ఇస్తారంని ఏపీ ప్రభుత్వ వర్గాలు ప్రస్నిస్తున్నాయి.

ఈ తరహా చర్యల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ - ఆంధ్రా బార్డర్ లో విద్యార్థుల పడిగాపుల వ్యవహారం ఉత్కంఠ రేపింది. సుమారు 8గంటలపాటు ప్రతిష్టంబన నెలకొంది. అంతకంతకు పరిస్థితి జఠిలమవుతుండటంతో సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ తో సంప్రదింపులు జరిపారు.  సరిహద్దులో ఆగిపోయిన ఏపీ వారి సమస్యలపై మాట్లాడారు. ఇరువురు సీఎంలు ఎక్కడివారిని అక్కడే ఉండేట్టుగా చూడాలని నిర్ణయించారు. జగ్గయ్యపేటవద్ద  ఉన్న ఏపీ వారికి హెల్త్ ప్రొటోకాల్ పాటించి..  రాష్ట్రంలోకి అనుమతించాలని  నిర్ణయించారు.  దీంతో క్వారెంటైన్ కి వెళతామంటేనే ఏపీలోకి అనుమతించిన ఏపీ పోలీసులు. క్వారెంటైన్ లో ఉండడానికి ఒప్పుకున్న 44 మంది ప్రయాణికులని నూజివీడు ట్రిపుల్ ఐటీలో వారికీ క్వారెంటైన్ ఏర్పాటు చేశారు.