వారం రోజులు పనిచేయండి... రెండు వారాలు రెస్ట్ తీసుకోండి 

వారం రోజులు పనిచేయండి... రెండు వారాలు రెస్ట్ తీసుకోండి 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ఇప్పటి వరకు ఏపీలో 329 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్నారు.  ఇప్పటికే కొంతమంది వైద్యులకు కరోనా వైరస్ ఎటాక్ అయ్యింది.  ఇప్పుడు వైద్యులను, నర్సులను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది.  

వీరి గురించి ఆలోచించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.  వారం రోజులపాటు పనిచేసిన వైద్య ఆరోగ్య సిబ్బందికి రెండు వారాలపాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.  ఇలా రెండు వారాలపాటు సెలవులు ఇవ్వడం వలన స్ట్రెస్ నుంచి బయటపడతారని అధికారులు అంటున్నారు.