హైదరాబాద్‌ హాస్టళ్ల మూసివేత విషయంలో రంగంలోకి ఏపీ సర్కార్

హైదరాబాద్‌ హాస్టళ్ల మూసివేత విషయంలో రంగంలోకి ఏపీ సర్కార్

హైదరాబాద్‌ హాస్టళ్ల మూసివేత విషయంలో రంగంలోకి దిగింది ఏపీ సర్కార్. ఏపీ విద్యార్థుల అగచాట్ల అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ తో ఏపీ మంత్రి బొత్స సత్యన్నారాయణ మాట్లాడారు. ఏపీ వారిని హాస్టళ్ల నుంచి ఖాళీచేయిస్తున్నారని, వారికి రవాణా ఇబ్బందులు వస్తాయని మంత్రి బొత్స చెప్పిన చెప్పినట్టు సమాచారం. లాక్ డౌన్ సమయంలో ఒక చోట నుంచి ఇంకో చోటకు కదలడం కూడా శ్రేయస్కరం కాదని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్ళి నట్టు సమాచారం. 

ఇదే అంశాలను తెలంగాణ సీఎస్‌ దృష్టికి కూడా ఏపీ సీఎస్‌ తీసుకెళ్ళారు. తెలంగాణ సీఎస్‌ సోమేష్‌కుమార్‌తో ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని మాట్లాడారు. తెలంగాణ సీఎంఓ అధికారులతో మాట్లాడిన ఏపీ సీఎంఓ అధికారులు ప్రత్యేకంగా పోలీసులు పాసులు ఇస్తున్న ఘటనలుకూడా తమ దృష్టికి వచ్చిందని పెర్కొనట్టు చెబుతున్నారు. ఈ సంప్రదింపుల తర్వాత హాస్టళ్లను, పీజీ మెస్‌లను మూసేయవద్దని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విస్పష్ట ప్రకటన చేసినట్టు చెబుతున్నారు.

హాస్టళ్ల యజమానులతో సంప్రదింపులు జరపాలని సిటీ పోలీస్‌ కమిషనర్, మేయర్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు. హాస్టళ్లు మూసివేత ప్రచారాలు వద్దని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, ప్రైవేటు సంస్థల్లో ఉన్నవారు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది. ఏపీలోని తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఎక్కడివారు అక్కడే ఉండాలంటూ స్పష్తం చేసింది. ఏమైనా సమస్యలు ఉంటే.. 1902కు కాల్‌చేయాలన్న ఏపీ ప్రభుత్వం.