ఏపీ ప్రభుత్వం మరో కొత్త యాప్... దేనికోసమంటే... 

ఏపీ ప్రభుత్వం మరో కొత్త యాప్... దేనికోసమంటే... 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కోసం ఇప్పటికే ఒక యాప్ ఉన్నది.  దూరప్రాంతాలకు వెళ్లే వాళ్ళ కోసం ఈ యాప్ పనిచేస్తోంది.  అయితే, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో యాప్ ను సిద్ధం చేస్తున్నది.   ఈ యాప్ ను విజయవాడ, విశాఖపట్నం లోకల్ బస్సుల కోసం తయారు చేస్తున్నట్టు సమాచారం.  

కరోనా నిబంధనలు పాటిస్తూ విశాఖ, విజయవాడ లోకల్ బస్సులను నడపాలని  ఆర్టీసీ యాజమాన్యం చూస్తున్న సంగతి తెలిసిందే.  టికెట్స్ లేకుండా బస్సులు నడపాలి. అందుకోసమే ఈ యాప్ ను డెవలప్ చేస్తున్నారు.  దీనికి ప్రథమ్ యాప్ అనే పేరు పెట్టినట్టు సమాచారం.   ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో అందులో ఎంటర్ చేసుకోవాలి.  అటు వైపు వెళ్లే బస్సులు, టైమ్స్ అన్ని లిస్ట్ లా ఇస్తుంది.  సెలక్ట్ చేసుకొని మనీ పే చేస్తే నాలుగు అంకెల పిన్ నెంబర్ వస్తుంది.  బస్సు ఎక్కే సమయంలో కండక్టర్ కు ఆ పిన్ నెంబర్ చెప్తే సరిపోతుంది. మొదట ఈ యాప్ ను సిటీ బస్సుల్లో వినియోగించేలా ప్లాన్ చేస్తున్నారు.  తరువాత ఇదే విధానాన్ని పల్లెవెలుగు బస్సుల్లో కూడా వినియోగించాలని చూస్తున్నారు.  వచ్చే నెల నుంచి ఈ యాప్ అందుబాటులోకి రాబోతున్నది.