నిరుద్యోగులకి ఏపీ సర్కార్ శుభవార్త

నిరుద్యోగులకి ఏపీ సర్కార్ శుభవార్త

ఏపీ ప్రభుత్వ  నియామకాల్లో 42 ఏళ్ల అర్హతా వయసు గడువును ఏపీ స‌ర్కార్ మరోమారు పొడిగించింది. నిజానికి 42 ఏళ్ల అర్హతా వయసు గడువు 2019 సెప్టెంబర్ 30తో ముగిసింది. అయితే ఈ క్రమంలో ఈ గడువును 2021 సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగిస్తూ సాధారణ పరిపాలన శాఖ నిన్న పొద్దుపోయిన తరువాత ఉత్తర్వులు విడుద‌ల‌ చేసింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల నియామకాల్లో గడువు పెంపును వర్తింప చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. 

వయోపరిమితిని 42 ఏళ్లకి పెంచడం ద్వారా నియామకాల ద్వారా ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించే అవకాశాలను ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించినట్టు అయ్యింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల నియామకాల్లో మాత్రమే ఇది పని చేయనుండగా యూనిఫాం సర్వీసులు అంటే పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖలకు సంబందించిన నియామకానికి ఈ వయో పరిమితి వర్తించదు. ఏదయితేనేమి వేరే ఉద్యోగాలా కోసం చూస్తున్న వయసు పైబడ్డ నిరుద్యోగులకి ఇది శుభవార్త అనే చెప్పచ్చు.