బోర్డర్ లో పడిగాపులు... ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు

బోర్డర్ లో పడిగాపులు... ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు

కరోనా వైరస్ విజృభనతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు దీనిని కఠినంగా అమలు చేస్తున్నాయి. అయితే ఇదే సమయంలో అన్ని మూతపడడంతో అంతా తమ సొంత ప్రాంతాలు, గ్రామాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇప్పుడు ఇదే ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కు కొత్త సవాల్ విసురుతోంది. ఇతర రాష్ట్రలతో పాటు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు ఏపీకి తరలివస్తున్నారు. దీంతో బోర్డర్ లోనే వాళ్ళను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇక ఈ అంశంపై స్పందించిన ఏపీ డీజీపీ కీలక వ్యాఖలు చేసారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను జాతీయ విపత్తు గా ప్రకటించింది అని గుర్తు చేసిన అయన.. ఎక్కడివారు అక్కడే ఉండాల్సిందిగా కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతిఒక్కరు సహకరించాలని దేశ ప్రధాని, ముఖ్యమంత్రి చేతులు జోడించి  ప్రజలందరిని  కోరారు అన్నారు. ఇది ఇలా ఉండగా నిన్నటి నుండి కొందరు నిబంధనలకు విరుద్దంగా ఆంధ్ర ప్రదేశ్ లోనికి రావడానికి ప్రయత్నిస్తూ సరిహద్దు తనిఖీ కేంద్రాల దగ్గరకు వచ్చి ఉన్నారు.. వారిని నిబంధనలకు విరుద్దంగా రాష్ట్రంలోనికి అనుమతించేది లేదు అని స్పష్టం చేసారు ఏపీ డీజీపీ 

ఇక బోర్డర్ వద్దకు వచ్చిన వారికి నిబంధనల మేరకు కచ్చితంగా రెండు వారాలపాటు క్యారంటైన్ నిర్వహించిన తరువాతే రాష్ట్రం లోకి అనుమతి ఉంటుంది అన్నారు ఏపీ డీజీపీ. లాక్ డౌన్ ఉదేశ్యం ఒక మనిషి నుండి మరొక మనిషికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అంటు వ్యాధి సంక్రమించకండా ఉండేలాగా చేయడమే.. బయట  నుండి ఆంధ్ర ప్రదేశ్ లోనికి అనుమతిచడం మన లాక్ డౌన్  ను నీరు గార్చటమే అని ఆవేదన వ్యక్తం చేసారు.. దయచేసి అట్టి వ్యక్తులు ఆర్థం చేసుకోగలరని మనవి చేసారు.