ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు..ఒకేరోజు 17 మంది మృతి

ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు..ఒకేరోజు 17 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి... శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1576 పాజిటివ్ కేసులు మాత్ర‌మే న‌మోదు కాగా.. ఇవాళ ఆ సంఖ్య మ‌రింత పెరిగింది.. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా న‌మోదైన కేసులు 1800 దాటిపోయాయి.. గ‌త 24 గంటల్లో 20,590 మందికి పరీక్షలు నిర్వహించగా 1813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 34 మందికి, వివిధ దేశాల నుంచి వచ్చిన 4 గురికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసులు 27,235కు చేరాయి. ఇదే స‌మ‌యంలో.. క‌రోనాబారిన‌ప‌డిన 17 మంది మృతిచెందారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మృతుల సంఖ్య 309 కి పెరిగింది. ప్ర‌స్తుతం 12,533 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక‌ గడచిన 24 గంటల్లో 1168 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తంగా ఇప్పటి వరకు 14,393 మంది డిశ్చార్జ్ అయ్యారు.