ఏపీలో భారీగానే నమోదయిన కేసులు

ఏపీలో భారీగానే నమోదయిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. గత 24 గంట‌ల్లో కొత్త‌గా రికార్డుస్థాయిలో 9,276 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 60,797 శాంపిల్స్ టెస్ట్ చేసిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.. ఇక‌, ఒకేరోజు 58 మంది క‌రోనా బారిన‌ ప‌డి మృతి చెందారు. ఇవాళ అత్య‌ధికంగా కర్నూల్ లో 1234, తూర్పు గోదావ‌రిలో 876, విశాఖ‌ప‌ట్నంలో 1155, అనంతపురంలో 1128, గుంటూరు 1001 పాజిటివ్ కేసులుగా నిర్ధారించారు. 

ఇక‌, ఇవాళ 58 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు.. వీరులో అత్య‌ధికంగాతూర్పు గోదావ‌రి, విశాఖ‌లో ఎనిమిది మంచి చొప్పున మరణించగా గుంటూరులో ఏడుగురు, అనంత‌పూర్‌, చిత్తూరు, కర్నూల్ లో ఆరుగురు చొప్పున, శ్రీకాకుళం నలుగురు, కృష్ణ, ప‌శ్చిమ‌గోదారిలో ముగ్గురు చొప్పున, నెల్లూరు, ప్ర‌కాశం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఇద్దరిద్దరు చొప్పున మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 150209కి చేరుకోగా.. ఇప్ప‌టికే 76614 మంది పూర్తిగా కోలుకున్నారు.. ప్ర‌స్తుతం 72188 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్ప‌టి వ‌ర‌కు 1407 మంది మృతి చెందారు.