ఏపీ ప్రజల నోట్లో మట్టి, నీళ్లు కొట్టారు

ఏపీ ప్రజల నోట్లో మట్టి, నీళ్లు కొట్టారు

ప్రధాని నరేంద్ర మోదీ... ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నోట్లో మట్టి, నీళ్లు  కొట్టారంటూ మండిపడ్డారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. నాలుగేళ్ల పాలన అవినీతి, నయవంచనేనని విమర్శించిన ఆయన... ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. 2014లో విభజన హామీలు అమలు చేస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన రఘువీరా... 100 రోజుల్లో నల్లధనం తీసుకొస్తామని ఒక్కపైసా కూడా వెనక్కి తీసుకురాలేక పోయారంటూ సెటైర్లు వేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి ఏరులైపారుతోందని ఆరోపించిన పీసీసీ చీఫ్... మోదీ సన్నిహితులు బ్యాంక్ లను మోసం చేసినా... వారిని కాపాడుతోంది మాత్రం మోదీ ప్రభుత్వమే అన్నారు. 

'కాంగ్రెస్ ముక్త్ భారత్' నీ వల్ల కాదు... కానీ, మోదీ విముక్త్ బీజేపీ కావాలని... మీపార్టీ నేతలను కోరుకుంటున్నారన్నారు రఘువీరా... మోదీ రాక్షస పాలనకి చరమగీతం పలుకుతామని స్పష్టం చేశారు. అనవసరంగా టీటీడీ తేనెతుట్టిని కదిలించారన్నారు పీసీసీ చీఫ్... దాంతో ఎవరికీ ఉపయోగం లేదని... వీళ్ళ వ్యవహారంతో దేవుడి మీద కూడా నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని... ఇది మంచి పరిణామం కాదన్నారు. ఒక పూజారి నీకు నచ్చకపోవడంతో వ్యవస్థ మీదే నిర్ణయాలు తీసుకోవటం సరికాదన్న రఘువీరా... ఈ వ్యవహారాన్ని బీజేపీ, టీడీపీ రాజకీయం చేయటం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు బేషజాలకు పోకుండా ఈ న్యూసెన్సు ఆపాలన్నారు.