రిటైర్మెంట్ వయస్సు కుదింపు..ఏపీ ప్రభుత్వం సీరియస్.!

రిటైర్మెంట్ వయస్సు కుదింపు..ఏపీ ప్రభుత్వం సీరియస్.!

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు కుదిస్తున్నారని కొద్ది రోజులనుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రిటైర్మెంట్ వయస్సు కుదింపుపై  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదని తేల్చి చెప్పేసింది. ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తారని కొన్ని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ తరహా ప్రచారంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం సీఎం ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లింది. దాంతో తప్పుడు ప్రచారం చేసేవారిని ట్రేస్ చేస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. కాగా ఇదే విషయంపై డీజీపీకి కంప్లైంట్ చేయడానికి ఏపీ సచివాలయ సంఘం సిద్ధమౌతోంది. రిటైర్మెంట్ వయస్సు కుదింపుపై  సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఉద్యోగులు నమ్మవద్దని సచివాలయ ఉద్యోగుల సంఘం తెలిపింది.