జగన్ సర్కార్ గుడ్ న్యూస్: వారి ఖాతాల్లో రూ.15వేలు జమ 

జగన్ సర్కార్ గుడ్ న్యూస్: వారి ఖాతాల్లో రూ.15వేలు జమ 

వైఎస్ జగన్ వరసగా సంక్షేమ  పథకాలను ప్రవేశపెడుతూ దూసుకెళ్తున్నారు.  తాజాగా మరో  పథకం అమలు చేసేందుకు సర్కార్ సిద్ధం అయ్యింది.  లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే అనేక మందికి ఆర్ధికంగా చేయూతనిచ్చిన జగన్,  వైఎస్సార్  కాపునేస్తం పేరుతో మరో పథకం తీసుకొచ్చారు.  పేద కాపు మహిళలను ఆర్ధికంగా ఆదుకోవడానికి ఈ పథకం తీసుకొచ్చారు.  

 అర్హులైన పేద మహిళలకు ఈ పథకం ద్వారా  సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున ఐదేళ్ళలో వారికి రూ.75 వేల రూపాయల సహాయం అందిస్తామని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.  ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపుగా 2.36 లక్షల మహిళలకు లబ్ది చేకూరబోతున్నది.    ఈనెల 24 వ తేదీన వైఎస్ జగన్ ఈ పథకం  ప్రారంభించబోతున్నారు.   కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.