ఒంగోలు డెయిరీని పునరుద్ధరిస్తాం..

ఒంగోలు డెయిరీని పునరుద్ధరిస్తాం..

ఒంగోలు డెయిరీని మరింత బలోపేతం చేసేలా ఏపీ సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. ఈరోజు అమరావతిలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఒంగోలు డెయిరీ పటిష్టతపై మరిన్న చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఒంగోలు డెయిరీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు పూర్తి సహకారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 

అంతేకాకుండా రైతులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు చంద్రబాబు అంగీకరించారు. త్వరలోనే పాడి రైతులు-ఉద్యోగుల బకాయిలు చెల్లించి.. డెయిరీ పునరుద్ధరించే చర్యలు తీసుకున్నారు. అలాగే..ఈ దిశగా చర్యలు చేపట్టాలని ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.