మరికాసేపట్లో లాంచీ ప్రమాదస్థలికి చంద్రబాబు 

మరికాసేపట్లో లాంచీ ప్రమాదస్థలికి చంద్రబాబు 

మంటూరు లాంచీ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, సీఎంవో అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. మరకాసేపట్లో ప్రమాద స్థలానికి సీఎం చంద్రబాబు చేరుకొని సహాయక చర్యలకు స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే చంద్రబాబు.. గాలింపు, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే మరిన్ని క్రేన్లను రప్పించాలని.. మృతదేహాల వెలికితీత.. పోస్ట్ మార్టమ్ నిర్వహణ త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.   
 
గోదావరి నీటిలో దాదాపు 60 అడుగుల లోతులో లాంచీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం సాయంత్రం లాంచీ గోదావరి నదిలో మునిగిన ఘటనలో అధికార బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. మునిగిన లాంచీని ఎట్టకేలకు ఎన్డీఆర్ఎప్ బృందాలు గుర్తించాయి. లాంచీ మునిగిన రేవు వద్దకు పోలీస్‌, రెవెన్యూ, ఫైర్‌, ఇతర శాఖల సహాయ సిబ్బంది పెద్దఎత్తున చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.