17న ఢిల్లీకి చంద్రబాబు

17న ఢిల్లీకి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 17న ఢిల్లీకి వెళుతున్నారు.  అదే రోజున నీతి ఆయోగ్ ఆధ్వ‌ర్యంలో జరిగే సీఎంల సమావేశంలో ఆయ‌న పాల్గొంటారు.   రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణం వంటి అంశాల‌ను ఆయ‌న ఈ స‌మావేశంలో ప్ర‌స్తావిస్తార‌ని తెలుస్తోంది.  కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రి వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు ఈ స‌మావేశంలో ప్రస్తావించనున్నారు.