అమరావతిలో ఐదేళ్లు ఉచితంగా ఆఫీసు స్పేస్?

అమరావతిలో ఐదేళ్లు ఉచితంగా ఆఫీసు స్పేస్?

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఉన్న ప్రత్యేకతలను వివరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... సీఆర్డీఏ పరిధిలో జరుగుతోన్న పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన... అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ సంతోష నగరంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నాం... ఇది భావి నగరమన్న ఏపీ సీఎం... సాంకేతికతను మేళవించి అత్యంత ఆధునిక నగరంగా దీన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. 

ఇక కొత్త నగరంలో రియల్ ఎస్టేటుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు... 2 వేల ఎకరాల మేర ద్వీపాలు కృష్ణానదిలో అమరావతికి ఆనుకుని ఉన్నాయని... రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం... సీఆర్డీఏ పరిధిలో ఉన్న చెరువులన్నీ నీటితో కళకళలాడేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మరోవైపు భూగర్భ కేబుల్ వ్యవస్థ ఈ నగర ప్రత్యేకత అన్నారు చంద్రబాబు... మూడు కాల్వలతో విస్తరించిన విజయవాడ సిటీ అమరావతికి జంటనగరమన్న ఏపీ సీఎం... అమరావతిలో ఐటీ కంపెనీలకు ఐదేళ్లు ఉచితంగా ఆఫీసు స్పేస్ అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.