మంత్రులతో చంద్రబాబు భేటీ 

మంత్రులతో చంద్రబాబు భేటీ 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. లాంచీ ప్రమాదం, పాతగుంటూరు ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆడపిల్లల జోలికి వచ్చేవారిని ఉపేక్షించవద్దని... నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని..ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ఒకరిద్దరిని కఠినంగా శిక్షిస్తే మిగిలినవారికి బుద్ధి వస్తుందని కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలన్న ప్రచారం విస్తృతంగా జరపాలని..నేరాలకు పాల్పడితే జీవితాలు నాశనం అవుతాయన్న ఇంగితం పెరగాలని కూడా బాబు  సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, యనమల, కాల్వ, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, సుజయకృష్ణ రంగారావు పాల్గొన్నారు.