తెలుగుజాతి తిరగుబాటు చేస్తే కేంద్రం గజగజలాడుతుంది

తెలుగుజాతి తిరగుబాటు చేస్తే కేంద్రం గజగజలాడుతుంది

విజయవాడలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హజ్ హౌస్ బిల్డింగ్ శంఖుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రూ.80 కోట్ల వ్యయంతో విజయవాడలో హాజ్ హౌస్ బిల్డింగ్ ను దేశానికే మోడల్ గా నిలిచేలా నిర్మిస్తున్నాం అని అన్నారు. హాజ్ యాత్రికులపై కేంద్ర ప్రభుత్వం జీయస్టీ వేయడం బాధాకరం అని విమర్శించారు. హైదరాబాద్ లో హాజ్ హజ్ ను నిర్మించింది టీడీపీ ప్రభుత్వంమే అని గుర్తుచేశారు.  ఉర్దూను రాష్ట్రంలో రెండవ భాషగా ప్రకటించింది కూడా టీడీపీ ప్రభుత్వమే అన్నారు. ఇమామ్లకు ఐదు వేలు, మౌజన్ లకు మూడు వేలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉర్దూ ఘర్, షాదీకానాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు టీడీపీ ప్రభుత్వంలో జరుగుతోందన్నారు. ఉర్దూ అకాడమీ ద్వారా ఉర్దూ భాషను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం అని పేర్కొన్నారు. హైదరాబాదు, కర్నూల్ లలో ఉర్దూ యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వమే అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జరిగిన అన్యాయాన్ని కేంద్రంపై పోరాటం చేస్తున్నాం అని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కోసం కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలుగుజాతి తిరగుబాటు చేస్తే.. కేంద్రం కూడా గజగజలాడుతుందన్నారు. రాబోయో ఎన్నికలలో 25 పార్లమెంటు సీట్లు గెలిచి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయిస్తామన్నారు.