తెలంగాణలో మాకు ఢోకా లేదు...

తెలంగాణలో మాకు ఢోకా లేదు...

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఢోకా లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... బెజవాడలో మహానాడు వేదికగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని స్పష్టం చేశారు. పటిష్టమైన నాయకత్వం ఉందని... ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తున్నారని తెలిపారు చంద్రబాబు. మూడుసార్లు ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ నేతలు నమ్మకంతో ఉన్నారని... తెలంగాణలో టీడీపీ త్వరలో కీలక పాత్ర పోషించబోతోందన్నారు టీడీపీ అధినేత. ఇప్పటికే హైదరాబాద్‌లో నిర్వహించిన టి.టీడీపీ మహానాడులో రాష్ట్ర పార్టీ నేతలకు, పార్టీ శ్రేణులకు భరోసా కల్పించిన చంద్రబాబు... విజయవాడ వేదికగా కూడా పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని నింపారు.