జనవరి నాటికి కియా తొలి కారు 

జనవరి నాటికి కియా తొలి కారు 

జనవరి నాటికి కియా తొలి కారు బయటికి రావాలన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎట్టి పరిస్థితులలోనూ జనవరి నాటికి కియా తొలి కారు బయటికి రావాలని ప్రతినిధులకు సీఎం చంద్రబాబు సూచించారు. కియా మోటార్స్ ఇండియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన ఆయన....ప్లాంటు పనుల పురోగతిపై సమీక్షించారు. 

ప్లాంట్ పనులు త్వరితగతిన అవుతున్నాయంటూ సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కియా ప్లాంటులో జరుగుతున్న అభివృద్దిపై వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. జనవరి నాటికి పరిస్థితులలోనూ కియా తొలి కారును తాను ఏపీలో చూడాలన్నారు. కొత్త ఏడాదిలో ఇండియన్ మేడ్ కొత్త కారును అందించాలని సీఎం కోరారు.