9.30కి కేబినెట్ భేటీ.. 11 గంటల నుంచి అసెంబ్లీ.. తేల్చేస్తారా..?

9.30కి కేబినెట్ భేటీ.. 11 గంటల నుంచి అసెంబ్లీ.. తేల్చేస్తారా..?

ఈ నెల 20వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి... ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న ఏపీ కేబినెట్‌లో రాజధానిపై హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలపనున్నారు.. అనంతరం హైపవర్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది సర్కార్.. ఇక, 20వ తేదీ నుంచి మూడురోజుల పాటు అంటే, 20, 21, 22 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది సర్కార్. 

మరోవైపు ఈసారి సమావేశాల్లో సీఆర్డీఏ చట్ట సవరణతో పాటు ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది సర్కార్. విశాఖ నుంచి పరిపాలన కొనసాగించాలని భావిస్తున్న వైసీపీ సర్కార్.. రాష్ట్రంలో మొత్తం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. అయితే, ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ కమిటీలు రాష్ట్రంలో మూడు రాజధానులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలపడం.. దానిపై ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేయడంతో.. ఇప్పటికే మూడు ధపాలుగా సమావేశమైన హైపవర్ కమిటీ.. ఆ రెండు కమిటీల నివేదికలతో పాటు... రాజధాని ప్రాంత రైతులు, 13 జిల్లాల అభివృద్ధిపై చర్చించింది.. ఇక, కేబినెట్ సమావేశం, అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడంతో... రాజధానిపై ఫైనల్‌గా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది... మరోవైపు మొదట కొన్ని శాఖలను విశాఖకు తరలించి ఈ నెలలోనే అక్కడి నుంచి  పాలన ప్రారంభించాలనే ప్లాన్‌లో ఉన్న ఏపీ సర్కార్... ఈ విషయంపై కూడా అసెంబ్లీలో ఓ నిర్ణయానికి రానుంది.